• US Elections 2024

logo

  • Telugu News
  • Movies News
  • రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

family star review: రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

Family Star Review: విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’ ఎలా ఉందంటే?

Family Star Review; చిత్రం: ఫ్యామిలీస్టార్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌; సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌; నిర్మాత: దిల్‌రాజు, శిరీష్‌; దర్శకత్వం: పరశురామ్‌; విడుదల: 05-04-2024

‘గీత గోవిందం’తో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ  - ప‌ర‌శురామ్ క‌ల‌యిక‌లో రూపొందిన సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’.  అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్  నిర్మించింది. మంచి కాంబినేషన్‌, భారీ అంచ‌నాలు, దీటైన ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విజయ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

eenadu movie review telugu

క‌థేంటంటే: గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజినీర్‌గా ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యానికి బానిసైన పెద్ద‌న్న‌య్య‌, ఇంకా జీవితంలో స్థిర‌ప‌డే ద‌శ‌లోనే ఉన్న చిన్న‌న్న‌య్య‌. వాళ్ల కుటుంబాల మంచీ చెడుల్ని చూస్తూ చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే అత‌ని కుటుంబాన్నీ అర్థం చేసుకుని వాళ్ల‌తో క‌లిసిపోతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. (Family Star Review) ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ని ఎలా ప్ర‌భావితం చేసింది?అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ జీవితంలోకి ఎలా వ‌చ్చింది? అత‌ను  మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా?  త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: త‌న కుటుంబాన్ని... త‌న జీవితంలోకి వ‌చ్చిన ఓ అమ్మాయినీ ప్రాణంగా ప్రేమించిన ఓ యువ‌కుడి క‌థే ఈ చిత్రం. కుటుంబం కోసం ఎంత దూర‌మైనా వెళ్లే ఆ యువ‌కుడు.. అదే స్థాయిలో త‌న కుటుంబాన్ని, త‌న మ‌న‌స్త‌త్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? మ‌ధ్య‌లో వ‌చ్చిన అపార్థాలు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి కార‌ణ‌మ‌య్యాయ‌న్న‌ది ఈ సినిమాలో కీల‌కం. ‘ఐ ల‌వ్ యూ’ అనే మాట ఓ వ్య‌క్తికి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేది అంటూ మ‌న కుటుంబ వ్య‌వ‌స్థ బ‌లాన్ని ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌తో చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. క‌థప‌రంగా చూస్తే చిన్న అంశ‌మే. ఓ బ‌ల‌మైన సినిమాకి, అంచ‌నాలున్న సినిమాకి కావాల్సిన స‌రకు, సంఘ‌ర్ష‌ణ అందులో క‌నిపించ‌వు. కానీ, కొద్దిమంది ద‌ర్శ‌కులు క‌థ‌నం, మాట‌ల‌తోనే మేజిక్ చేస్తుంటారు. ప‌ర‌శురామ్‌లోనూ అలాంటి ర‌చ‌యిత ఉన్నాడ‌ని ఆయ‌న సినిమాలు చాటి చెప్పాయి. అయితే ఈ సినిమా విష‌యానికొచ్చేస‌రికి  క‌థ‌నం ప‌రంగానూ ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. (Family Star Review telugu) ఘ‌న విజ‌యం సాధించిన ‘గీత గోవిందం’ త‌ర్వాత ఆ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా ఇది. ప్ర‌త్యేక‌మైన  అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కి వ‌స్తాడు. అయితే అటు హాస్యంప‌రంగా కానీ, ఇటు క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా కానీ  ఏ ద‌శ‌లోనూ ఆ అంచ‌నాల్ని అందుకోలేదు ఈ చిత్రం.

eenadu movie review telugu

మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసే విన్యాసాలతో క‌థ మొద‌ల‌వుతుంది. ఇంట్లోనూ, బ‌య‌టా పొదుపు కోసం క‌థానాయ‌కుడు ప‌డే పాట్ల‌తో స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. అవి సాగుతున్న‌ట్టే ఉంటాయి త‌ప్ప పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. వాస్తు ప్ర‌కారం సాగే ఫైట్ కాస్త కొత్త‌గా ఉంటుంది. ఇందు పాత్ర రాక త‌ర్వాత కూడా స‌న్నివేశాలు పెద్ద‌గా పండ‌లేదు. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలే సినిమాని కాస్త ఆస‌క్తికరంగా మార్చాయి. అక్క‌డ మ‌లుపు ఊహించేదే అయినా, ద్వితీయార్ధంపై అంచ‌నాలు పెంచుతాయి.  అమెరికా నేప‌థ్యంలో సాగే ద్వితీయార్ధంలోని  చాలా స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇందు థీసిస్ ప్ర‌సంగం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపించినా, ప‌తాక స‌న్నివేశాలు  సాధార‌ణంగానే అనిపిస్తాయి. (Family Star Review) అక్క‌డ‌క్క‌డా కొంత సంఘ‌ర్ష‌ణ‌, కొన్ని మాట‌లు,  విజ‌య్ దేవ‌ర‌కొండ - మృణాల్ ఠాకూర్ జోడీ మిన‌హా సినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌రకొండ ( Vijay Deverakonda ) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడైన గోవ‌ర్ధ‌న్ పాత్ర‌లో ఒదిగిపోయాడు.  పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తూనే,  స్టైలిష్‌గా త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించాడు. మృణాల్ పాత్ర కూడా మెప్పిస్తుంది. ఇందు పాత్ర‌లో ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వుతూ న‌వ్విస్తూ అందంగా క‌నిపించింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర చుట్టూ పండిన భావోద్వేగాలు సినిమాకి కీల‌కం. విజ‌య్‌, మృణాల్  ఇద్ద‌రి జోడీ బాగుంది.  రోహిణి హ‌ట్టంగ‌డి పోషించిన బామ్మ పాత్ర  మిన‌హా మిగిలిన పాత్ర‌లేవీ బ‌లంగా లేవు. జ‌గ‌ప‌తిబాబు, వెన్నెల కిశోర్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులంతా అల‌వాటైన పాత్ర‌ల్లో అక్క‌డ‌క్క‌డా క‌నిపించి వెళ్లిపోతుంటారు. మ‌రో క‌థానాయిక దివ్యాంశ కౌశిక్  కాసేపు క‌నిపించి ఆ త‌ర్వాత ఆ పాత్ర జాడే ఉండ‌దు. ప‌తాక స‌న్నివేశాలతో విల‌న్ వ‌చ్చినా, పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒక‌రిలాగే ఆ పాత్ర మిగిలిపోతుంది త‌ప్ప ప్ర‌భావం చూపించ‌లేదు.

  • బ‌లాలు
  • + విజ‌య్, మృణాల్ జోడీ
  • + విరామానికి ముందు సన్నివేశాలు
  • + కొన్ని సంభాషణలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు, హాస్యం
  • చివ‌రిగా: ఫ్యామిలీ ‘స్టార్‌’.. కొన్ని మెరుపులే..! (Family Star Review telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Cinema News
  • Movie Review
  • Vijay Deverakonda
  • Entertainment News

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ థ్రిల్‌ చేశారా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్‌ కొత్త మూవీ అలరించిందా?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: లబ్బర్‌ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: సింగం అగైన్‌.. రోహిత్‌శెట్టి రొటీన్‌ పచ్చడి..!

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

  • జిల్లా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్

eenadu_Relief_fund_20240905

తాజా వార్తలు (Latest News)

మూడు గంటలు నరకయాతన..!

మూడు గంటలు నరకయాతన..!

‘నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానం చెప్పాలా?’

‘నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానం చెప్పాలా?’

రఘురామ డిప్యూటీ స్పీకర్‌ అయితే... ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్‌ అసెంబ్లీకి రారు

రఘురామ డిప్యూటీ స్పీకర్‌ అయితే... ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్‌ అసెంబ్లీకి రారు

పిండం ఎదుగుదలపై మెట్‌ఫార్మిన్‌ ప్రభావం!

పిండం ఎదుగుదలపై మెట్‌ఫార్మిన్‌ ప్రభావం!

సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు.. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు.. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్‌ను నియమించిన ట్రంప్‌

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్‌ను నియమించిన ట్రంప్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

eenadu movie review telugu

Privacy and cookie settings

Scroll Page To Top

There is a proverb in China which says, “A spark can start a fire that burns the entire prairie”. A spark is all we need to start mending our lives and one fine day, life changes. So what happens when a common man starts mending his life? What happens when he loses his patience? The answer to some of these questions forms the basis of Chakri Toleti’s “Eenadu” starring Venkatesh and Kamal Hassan. It’s an engaging, edge of the seat thriller which deserves to be seen with great intent.

eenadu movie review telugu

What is Good: Written by Neeraj Pandey, “Eenadu” has breathtaking pace throughout its narration. A sense of urgency is ubiquitous in everything that occurs on screen. The film also owes its impact to a sensible and sensational portrayal of both Venkatesh and Kamal Hassan. While Venkatesh is at his usual best in the role of a cop; Kamal Hassan’s portrayal of a common man is the focal point of the entire story. The whole drama follows the Heisenberg’s uncertainty principle, with every phone call from Kamal changing the whole equation which hits a crescendo towards the end. Both these actors are wonderfully supported by Dr.Bharat Reddy and Ganesh Venkataraman, both enacting as cops in Commissioner’s office.

What is bad: The film is the remake of “A Wednesday” and comparison with the original film is inevitable. “Eenadu”, although for most part, retains the essence of the original flick but doesn’t quite create that same dramatic impact. Too many scenes have a problem with the lip synchronization. Lakshmi's role as the Chief Secretary is a little half baked. Poonam Kaur’s role is completely forgotten after a point of time.

Technical Departments: “Eenadu” is a technically flawless film except for the patchy work in dubbing. Manoj Soni’s cinematography captures the mood and pace of the film with magnificence. Shruthi Hassan’s debut as a music director couldn’t have been more sensational. She packs a punch with her explosive background score which provides an extra dose of adrenaline to the story. Editing by Rameshwar Bhagwat is top notch in keeping this film engaging throughout. Neelakanta who wrote some of the most thought provoking dialogues in recent times also infuses some subtle comedy. Debutant director, Chakri Toleti owes a great deal to the brilliant story written by Neeraj Pandey. He religiously follows the footsteps of Neeraj Pandey and ensures that the film stands out rather than being just another thriller.

Me Thinks: Eenadu is the kind of film, especially the theme, which comes once in a blue moon. It’s a film marked with anger and frustration of a tortured soul written all over it. A thought provoking tale of a common man, Eenadu is a splendid tale of conscience, the choices we make and above all, life itself.

Tailpiece: If you have seen the original flick in Hindi, don’t reveal the story. If not, go watch “Eenadu” today. It’s a wonderful film which promises some edge of the seat action.

Click here for Review by Aks

IMAGES

  1. Eenadu review. Eenadu Telugu movie review, story, rating

    eenadu movie review telugu

  2. Eenadu 1982

    eenadu movie review telugu

  3. Eenadu Telugu Full Movie HD

    eenadu movie review telugu

  4. Eenadu Movie (2009): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    eenadu movie review telugu

  5. Eenadu

    eenadu movie review telugu

  6. Meter Movie Review: రివ్యూ: మీటర్

    eenadu movie review telugu